గోడల పై పెళ్లిపిలుపు
గోడలపై పెళ్లిపిలుపు!
ఎవరైనా పెళ్లిపిలుపులు పత్రికలుగా వేయిస్తారు. ఇప్పుడు ట్రెండ్‌ను బట్టి కొత్తకొత్తగా పెళ్లి కార్డులువస్తున్నాయనుకోండి, కానీ ఎవరెలా చేసినా సాధారణంగా పత్రికలు కొట్టించి ఊరుకుంటారు. కానీశ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఈ పద్ధతి కాస్త వెరైటీగా ఉంటుంది. ఇక్కడ ఏ ఇంట్లో పెళ్లి జరుగుతుందోఆ ఇంటి గోడపై అందరికీ కనిపించేలా పెయింట్‌తో అందంగా చిత్రంలా గీస్తారు. అందులో వధూవరులపేర్లతోపాటు ముహూర్తపు వివరాలు కూడా ఉంటాయి. పెళ్లి జరిగిపోయినప్పటికీ ఈ పెయింటింగ్‌మాత్రం గోడలపై కనిపిస్తూనే ఉంటుంది. ఇందుకోసం పెయింటర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈచిత్రాలను తీర్చిదిద్దుతుంటారు. ఇలా ఆ జిల్లాలో అధికశాతం ఇళ్లపై ఈ పెళ్లి పిలుపులు వచ్చే పోయేవారిని పలకరిస్తూ ఉంటాయి!
2024-01-18 17:03:04