Help / Request Callback
image
Join the family to be a successful story at Eenadu Pellipandiri Register Free

ఎంత ఖరీదైన పెళ్లిళ్లో!

పెళ్లి అంటే జీవితంలోనే మరపురాని వేడుక. ఎంతో ఆనందంగా, ఉన్నదాంట్లో ఆడంబరంగా జరుపుకోవాలనే అందరూ అనుకుంటారు. మన దేశంలో అధికశాతం ప్రజలు తమ జీవితకాలపు సేవింగ్స్‌ను పెళ్లిళ్ల కోసం ఖర్చు చేస్తుంటారు. మరి సాధారణ ప్రజలే అలా ఆలోచిస్తే.. అసాధారణ సంపద కలిగిన కుబేరులు ఇంకెంత ఖర్చు పెట్టాలి! మరి మన దేశ చరిత్రలోనే అత్యంత వైభవంగా జరిగిన వారి ఇంటి పెళ్లిళ్ల గురించి తెలుసుకుందామా.

లగ్జరీ వెడ్డింగ్ ట్రెండ్స్ - ఎంత ఖరీదైన పెళ్లిళ్లో!


ఇషా అంబానీ - ఆనంద్‌ పిరిమళ్‌ (రూ.600 - 700 కోట్లు)

భారతదేశంలో అత్యంత వైభవంగా జరిగిన పెళ్లిళ్ల గురించి మాట్లాడితే.. ముఖేష్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ పెళ్లి గురించే గుర్తొస్తుంది. బహుశా ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పెళ్లి జరిగి ఉండదు. ఈ వివాహంలో భాగంగా ఉదయ్‌పూర్, ఇటలీ, ముంబయిలో అంబానీ స్వగృహంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పెళ్లి ఆహ్వానపత్రికలో అతిథులకు బంగారు గొలుసులు బహుమతిగా ఇచ్చారు. వీరి పెళ్లిలో అన్నింటికంటే ఆకర్షించిన అంశం హాలీవుడ్‌ టాప్‌ సింగర్‌ బియాన్సే నృత్య ప్రదర్శన. అమితాబ్‌బచ్చన్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రా వంటి బాలీవుడ్‌ అగ్రనటులంతా ఈ శుభకార్యానికి హాజరయ్యారు. అమితాబ్, షారుఖ్‌ అయితే విందులో స్వయంగా వంటకాలు కూడా వడ్డించారు! ఈ పెళ్లిలో ఇషా ధరించిన లెహంగా ఖరీదు రూ.90 కోట్లు. ఇషా తల్లి నీతా అంబానీ పెళ్లి చీరను ఇలా తిరిగి లెహెంగాలా మలిచారు. పెళ్లి తర్వాత వధూవరులు రూ.450 కోట్లు విలువ చేసే లగ్జరీ మాన్షన్‌లోకి మారారు.

Meet Your Perfect Match Now! Register on Eenadu Pellipandiri Today!

రాజీవ్‌ రెడ్డి - బ్రహ్మణి రెడ్డి (రూ.500 - 510 కోట్లు)


కర్ణాటక మాజీ మంత్రి జనార్దన్‌రెడ్డి కూతురు బ్రహ్మణి రెడ్డి పెళ్లికి దాదాపు రూ.500 కోట్లు ఖర్చయ్యింది. ఇది దేశంలో అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటి. 5 రోజులపాటు జరిగిన ఈ పెళ్లికి దాదాపు 50 వేల మంది అతిథులు హాజరయ్యారు. బెంగళూరులోని ఐదు, మూడు నక్షత్రాల హోటళ్లలో వీరి కోసం దాదాపు 1500 గదులను బుక్‌ చేశారు. వేదిక వద్ద కాపలా కాసేందుకే 3 వేల మంది మనుషులను నియమించారు! వధూవరులు ధరించిన బంగారు, వజ్రాభరణాల ఖరీదు దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. పెళ్లికూతురు రూ.17 కోట్లు విలువైన కాంజీవరం చీర ధరించింది. ఈ చీరలో ఉన్న దారపు పోగులన్నీ బంగారమే! అందుకే అంత ఖరీదు. ఆమెకు మేకప్‌ చేసేందుకు దాదాపు 50 మంది నిపుణులను నియమించారు. వేదిక చుట్టుపక్కల విజయనగర సామ్రాజ్య కట్టడ రీతులను తలపించేలా బాలీవుడ్‌ ఆర్ట్‌ డైరెక్టర్లతో టెంపుల్‌ సెట్టింగ్స్‌ వేయించారు. అతిథులను కళ్యాణ వేదికకు తీసుకెళ్లేందుకు 15 హెలికాప్టర్లు, 2 వేల కార్లను ఏర్పాటు చేశారు.

వనిషా మిట్టల్‌ - అమిత్‌ భాటియా (రూ.200 - 300 కోట్లు)


స్టీల్‌ వ్యాపారి లక్ష్మీ మిట్టల్‌ కూతురు వనిషా పెళ్లి ఖర్చు కూడా అప్పట్లో సంచలనం రేపింది. ప్యారిస్‌లో ఆరు రోజులపాటు ఈ వివాహం నిర్వహించారు. ప్రఖ్యాత బాలీవుడ్‌ కవి జావేద్‌ అక్తర్‌తో ఒక నాటకం రాయించి ప్రీవెడ్డింగ్‌ ఫంక్షన్‌లో మిట్టల్‌ కుటుంబ సభ్యులు ప్రదర్శించారు. పెళ్లిని 17వ శతాబ్దానికి చెందిన పురాతన ప్యాలెస్‌లోనిర్వహించారు. వివాహ వేదిక నిర్మాణం కోసం 35 మంది నిపుణులను ఇండియా నుంచి ప్యారిస్‌ తీసుకెళ్లారు. ఫైబర్‌గ్లాస్‌తో చేసిన ఏనుగుబొమ్మలు, హాలాండ్‌ నుంచి తెప్పించిన తాజా పూలతో వేదికను అత్యంత సుందరంగా నిర్మించారు. ఆరోజు సాయంత్రం ఈఫిల్‌ టవర్‌ వద్ద ప్రత్యేకంగా బాణాసంచా కాల్చారు.

Meet Your Perfect Match Now! Register on Eenadu Pellipandiri Today!

యోగితా జాన్‌పూరియా - లలిత్‌ తన్వార్‌ (రూ.230 - 250 కోట్లు)


రాజకీయ నాయకుడు కన్వర్‌ తన్వార్‌ కొడుకు లలిత్‌ తన్వార్‌ పెళ్లి కూడా ఘనంగా జరిగింది. దిల్లీలో వీరికుటుంబానికి చెందిన ఫామ్‌ హౌస్‌లో ఈ వివాహం జరిపించారు. పెళ్లి కొడుక్కి అత్తింటివారు బెల్‌ 429 హెలికాప్టర్‌ను కానుకగా ఇచ్చారు. ఇండియన్, చైనీస్, థాయ్‌ రుచుల్లో దాదాపు వందకు పైగా శాకాహార వంటకాలను

విందులో వడ్డించారు. దీనికి 30 వేల మందికిపైగా అతిథులు హాజరయ్యారు. ఇదే సమయంలో పెళ్లి ఖర్చులుభరించలేని వధువులకు సొంతంగా పెళ్లిళ్లు చేయించారు. వచ్చిన అతిథులకు 30 గ్రాముల వెండి, ఒక సఫారీ సూట్,కొంత డబ్బును కానుకగా ఇచ్చారు.


- చంద్రమౌళిక సాపిరెడ్డి
 

2023-08-21 15:27:58

Back