బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్స్ పార్ట్ - 1
అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.. అందమైన జీవితం ముందుంది.. దాన్ని ఆనందంగా ప్రారంభించాలంటే..మీ జీవిత భాగస్వామితో ఓ చక్కటి హనీమూన్ ట్రిప్‌కి వెళ్లాల్సిందే! మరి మన దేశం నుంచి సులభంగా, తక్కువ ఖర్చులో వెü•్లచ్చేలా బడ్జెట్ ఫ్రెండ్లీ హనీమూన్ డెస్టినేషన్స్ ఏం ఉన్నాయో ఓ లుక్కేద్దామా!
బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్స్ - పార్ట్ 1 | కొత్త జంటల కోసం అద్భుతమైన ట్రిప్ ఐడియాస్
అద్భుతం.. అండమాన్!
ద్వీప సౌందర్యానికి ఆలవాలమై నిలిచే అండమాన్ - నికోబార్ దీవులు. ప్రకృతి ఒడిలో మైమరచిపోవాలనుకునే కొత్త జంటలకు మొదటి ఎంపిక. ఇక్కడ ఉండే హావ్లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్,రాధానగర్ బీచ్ వంటి చోట్లకు వెళ్తే. ఇక అక్కడి నుంచి తిరిగి రాబుద్ధి కాదంటే నమ్మండి! లగ్జరీ రిసార్టులు, స్వచ్ఛమైన సముద్రతీరాలు, ఆహ్లాదకరమైన వాతావరణం.. అన్నీ కలిపి సూపర్ రొమాంటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయి. ఇది ఇండియాలోనే ఎక్కువమంది ఎంచుకునే హనీమూన్ డెస్టినేషన్. జనవరి నుంచి మే వరకూ పర్యటనలకు అనుకూలంగా ఉంటుంది. జంటకు సగటున రూ.౪౦ వేల నుంచి రూ.౮౦వేల వరకూ ఖర్చవుతుంది. మైమరపించే.. మలేసియా! అటు అత్యాధునిక వసతులు.. ఇటు అతి పురాతన సంస్కృతి మధ్య.. మలేసియా మీ మనసులు దోచేయకమానదు! ఆసియాలో ఉన్న దేశాల్లో తక్కువ ఖర్చుతో మంచి అనుభవాలను ఇచ్చే హనీమూన్ డెస్టినేషన్‌గా దీనికి చాలా పేరుంది. రకరకాలైన వాటర్ స్పోర్ట్స్, కేబుల్‌కార్ రైడ్, జంగిల్ ట్రెక్కింగ్, ఐలాండ్ హాపింగ్.. ఇలా చాలా చేయొచ్చు. టైమన్ ఐలాండ్, లాంగ్‌క్వాయ్, పెర్హెంటియన్ ఐలాండ్ వంటివి తప్పక చూడాల్సిన ప్రదేశాలు. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకూ పర్యటించేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సగటున రూ.80 వేల నుంచి రూ.లక్షా ఇరవై వేల వరకూ ఖర్చవుతుంది.
భలే భలే.. బాలి!
పెళ్లి పనులు, షాపింగ్, చుట్టూ జనాలు, హడావుడితో అలసిపోయారా. అయితే మీకో బ్రేక్ తప్పనిసరి. మరి ఇంకెందుకు ఆలోచన.. చలో బాలి! ఇక్కడ ఉండే అందమైన రిసార్ట్స్ ఒక అద్భుతమైన ప్రారంభానికి వేదిక కాగలవు. పురాతన నిర్మాణశైలితో అలరారే దేవాలయాలు, ఆకర్షించే తీర సౌందర్యంతో చూడచక్కని బీచ్‌లు, పారాసైలింగ్ వంటి సాహసక్రీడలు.. ఇలా ఇక్కడ చూడాల్సినవి, చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ ఉంది. మే, జూన్, సెప్టెంబర్ నెలల్లో వెళ్లడం అనుకూలంగా ఉంటుంది. సగటున రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ ఖర్చవుతుంది.
థ్రిల్లిచ్చే థాయ్‌లాండ్!
మీ జీవిత భాగస్వామితో కలిసి ‘కపుల్ స్పా’ను ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా.. అయితే థాయ్‌లాండ్ వెళ్లడాన్ని మించిన ఆప్షన్ ఇంకోటి ఉండదు. ఇక్కడ షాపింగ్ అండ్ డైనింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే! ఈ దేశంలో ప్రకృతి ఒడిలో విహరించడం ఎంత ఆనందాన్నిస్తుందో.. గజిబిజి వీధుల్లో మార్కెట్ చేయడం కూడా అంతే సరదాగా ఉంటుంది. ఒక వారం రోజులపాటు ప్రపంచాన్ని మర్చిపోయేలాంటి మైకంలో తేలాలంటే.. థాయ్‌లాండ్‌లో అడుగుపెట్టాల్సిందే. దీనికి కూడా ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యం ఉంది. కావాలంటే రోడ్ ట్రిప్ కూడా వెü•్లచ్చు. ఇండియా - మయన్మార్ - థాయ్‌లాండ్ ట్రైలేటరల్ హైవే మీదుగా ప్రయాణం సాహసోపేతమైనదే కాదు, సరికొత్త థ్రిల్‌ను ఇచ్చేది కూడా! ఇక్కడికి వెళ్లేందుకు సగటున రూ.90 వేల నుంచి రూ.లక్షన్నర వరకూ ఖర్చవుతుంది.
Meet Your Perfect Match Now! Register on Eenadu Pellipandiri Today!
మధురమైన కల.. మారిషస్!
ఓ అందమైన స్వప్నంలో విహరించినట్లు అనిపించే మధురమైన అనుభూతి కావాలి అనుకుంటే. మారిషస్ వెళ్లాల్సిందే. ఇక్కడ డాల్ఫిన్స్, వేల్స్‌ను దగ్గర నుంచి చూడటం, ప్రైవేట్ ఐలాండ్‌లో రొమాంటిక్ డిన్నర్, క్రూయిజ్ ప్రయాణం వంటివి మీ అనుభూతులకు మరింత ఆనందాన్ని చేకూరుస్తాయనడంలో సందేహం లేదు. సాహసాలను ఇష్టపడేవారికైతే అగ్నిపర్వతాలపైకి ట్రెక్కింగ్, సాగర గర్భంలో స్కూబా డైవింగ్ వంటివి మరింతసరదాగా అనిపిస్తాయి. ఇక్కడికి వెళ్లేందుకు ఏప్రిల్ నుంచి జూన్ వరకూ, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకూ అత్యంత అనుకూలమైన కాలం. ఇండియన్స్‌కు ‘వీసా అన్ అరైవల్’ సౌకర్యం అందుబాటులో ఉంది. సగటున రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకూ ఖర్చవుతుంది.
2023-08-17 10:03:35